వర్షాకాలం చర్మ సంరక్షణ కోసం తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలు…

-

వర్షాకాలం వచ్చేసింది. మొన్నటివరకు తౌక్టే, యాస్ తుఫానులతో వాతావరణంలో జరిగిన మార్పులు ఇప్పుడు రుతువు మారుతున్న కారణంగా వస్తున్నాయి. కాలం మారుతున్నప్పుడు చర్మంలో మార్పులు సంభవిస్తుంటాయి. అందుకే చర్మంపై అధిక శ్రద్ధ అవసరం. వాతావరణంలో ఎక్కువగా ఉండే తేమ కారణంగా చర్మంపై మొటిమలు, దద్దుర్లు వస్తుంటాయి. వీటి బారి నుండీ కాపాడుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలను పాటించడం మంచిది.

వర్షాకాలం / చర్మ సంరక్షణ

కొబ్బరి నూనె, చక్కెర

కొబ్బరి నూనె చక్కెర మిశ్రమాన్ని తీసుకుని పెదాలపై మోచేతి భాగాలపై వర్తించాలి. దీనివల్ల ఆ ప్రదేశాల్లోని నలుపుదనం తొలగిపోతుంది. తద్వారా అందమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

శనగ పిండి, పసుపు, కుంకుమ పువ్వు

ఈ మూడింటినీ తీసుకుని మిశ్రమంగా చేసి ముఖానికి వర్తించాలి. దీని కారణంగా చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. వాతావరణంలో మార్పుల వల్ల తయారయ్యే బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి ఇది చక్కటి మార్గం.

నిమ్మకాయ, పిండి, తేనె, చక్కెర

చర్మం ఒకే రంగులో లేకపోవడం, మెడ భాగంలో ఒకలా, ముఖ భాగంలో మరోలా, చేతులు నల్లగా ఉండడం మొదలగు ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. దీనికోసం నిమ్మకాయ రసం, పిండి, తేనె, చక్కెర మిశ్రమాన్ని చేసి, ఎక్కడెక్కడైతే రంగులో తేడాలు కనిపిస్తున్నాయో అక్కడ మసాజ్ చేయాలి. ఆ తర్వాత 20నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పై మిశ్రమాలన్నీ చర్మంపై వర్తించేటపుడు మెల్లగా రుద్దాలి. చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news