స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలని అందిస్తోంది. అయితే ఆ తరహాలోనే ఇప్పుడు కస్టమర్స్ కి సరికొత్త సేవలని తీసుకు వచ్చింది. దీనితో కస్టమర్స్ కి మరెంత బెనిఫిట్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎంతో ఈజీగా ఇప్పుడు పొందొచ్చు. లోన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్లకి ఇది నిజంగా గుడ్ న్యూస్.
లోన్ పొందాలంటే బ్యాంక్ మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ లోన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో ఈ సర్వీసులని ఉపయోగించి సులభంగానే రుణాలు ఎస్బీఐ కస్టమర్లు పొందొచ్చు.
మీరు జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. అది కూడా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎంతో ఈజీగా లోన్ పొందే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. న్యూ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ఫెసిలిటీని ఎస్బీఐ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సర్వీసు ద్వారా వేగంగానే రుణం పొందొచ్చు.
ఎమర్జెన్సీకి డబ్బులు అవసరమైన లేదా ఏదైనా వెకేషన్ కి వెళ్లాలన్నా మీరు రుణం తీసుకోవచ్చు. కస్టమర్ రుణ అర్హత ప్రాతిపదికనే రుణ మంజూరీ ఉంటుంది. వడ్డీ రేటు కూడా 9.6 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. లోన్ పొందాలంటే State Bank of India @TheOfficialSBI 1613469958000 బ్యాంక్ నుంచి లోన్ పొందాలని భావించే వారు PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వాలంటే 7208933142 నెంబర్‌కు ఇవ్వండి. మీరు రుణం లభిస్తుంది.