ఈ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో.. ఉచిత సినిమా టికెట్లతో పాటు ఎన్నో లాభాలు..!

-

దేశీ అతిపెద్ద దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో బెనిఫిట్స్ ని అందిస్తోంది. అయితే తాజాగా క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డు తాజాగా మరో కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు. దేశంలోని ప్రముఖ ప్రీమియం గ్రాసరీ స్టోర్ బ్రాండ్ అయిన నేచర్స్ బాస్కెట్‌తో భాగస్వామ్యం ద్వారా ఎస్‌బీఐ కార్డు ఈ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొచ్చింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కొత్త క్రెడిట్ కార్డు పేరు నేచర్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు.

ఎస్‌బీఐ కార్డు ప్రీమియం పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా ఒక ముఖ్యమైన క్రెడిట్ కార్డు. ప్రీమియం కస్టమర్లు లక్ష్యంగా ఈ నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును తీసుకు రావడం జరిగింది. నేచర్స్ బాస్కెట్ క్రెడిట్ కార్డు రెండు రకాల వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీనిలో నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు, నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ రెండు రకాలుగా వున్నాయి.

ఇంటర్నేషనల్ ట్రావెల్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేసే వారికి ఈ కార్డ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఏప్రిల్ నెలలో కస్టమర్లకు ఈ కార్డ్స్ అందుబాటులోకి రానున్నాయి. నేచర్స్ బాస్కెట్ స్టోర్లలో ఈ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రతి రూ.100 కొనుగోలుపై 20 వరకు రివార్డు పాయింట్లు లభిస్తాయి.

ఇది ఇలా ఉంటే డైనింగ్, మూవీస్, ఇంటర్నేషనల్ ట్రావెల్ వంటి వాటి పై చేసే ఖర్చులకు రూ.100కు 10 రివార్డు పాయింట్లు వస్తాయి. ప్రతి ఏడాది ఏడాది రూ.6 వేల వరకు విలువైన బుక్‌మై‌షో మూవీ టికెట్లు ఉచితంగా పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఏడాదిలో రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేస్తే రూ.10 వేల విలువైన గిఫ్ట్ వోచర్లను ఉచితంగా పొందొచ్చు.

మెంబర్‌షిప్ ఇయర్‌లో రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు వెనక్కి వస్తుంది. నేచర్స్ బాస్కెట్ స్టోర్లలో ఎక్స్‌క్లూజివ్ చెక్‌ఔట్ కౌంటర్స్ తో పాటుగా ఎన్నో లాభాలు ఉంటాయి. రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తే ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి రూ.3 వేల ఉచిత వోచర్స్ లభిస్తాయి. రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజును చెల్లిస్తారు. ఈ ఎస్‌బీఐ కార్డు ఫీజు రూ.1499గా ఉంది. అదే నేచర్స్ బాస్కెట్ ఎస్‌బీఐ కార్డు ఎలైట్ అయితే రూ.4,999 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news