ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌తో ఇన్ని బెనిఫిట్స్‌!

-

మీకు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ ఉందా? అయితే, మీకు ఎన్నో లాభాలు అందిస్తోంది ఎస్‌బీఐ. దీనికి జస్ట్‌ మీరు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే చాలు. దీనివల్ల మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి. ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా శాలరీ అకౌంట్‌ రూపొందించింది. సాధారణ అకౌంట్లతో పోలిస్తే ఈ అకౌంట్‌ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ ఎక్కువే. కేవలం ఉద్యోగులకు మాత్రమే సాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టైతే, మీకు ప్రతీ నెలా వేతనం బ్యాంకు అకౌంట్‌లోకి వస్తున్నట్టైతే ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చు. దీనికి మీరు పనిచేస్తున్న ఆఫీసులో ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ మీరు పొందొచ్చు.

 

సాధారణంగా ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌. మీరు ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్‌
మెయింటైన్‌ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్‌లో డబ్బులు ఎన్ని ఉంటే మొత్తం డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయనందుకు మీరు ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకా ఈ ఖాతా ద్వారా కస్టమర్‌ ప్రొఫైల్‌ను బట్టి రూ.20 లక్షల వరకు యాక్సిడెంటల్‌ డెత్‌ కవర్‌ లభిస్తుంది. దీంతో పాటు ఎయిర్‌ యాక్సిడెంటల్‌ డెత్‌ కవర్‌ కూడా లభిస్తుంది. ఈ కవరేజీ ధర రూ.30 లక్షలు. అంతేకాదు ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌ హోల్డర్‌ పర్సనల్‌ లోన్, హోమ్‌ లోన్, కార్‌ లోన్‌ రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజుపై 50 శాతం తగ్గింపు. వీరికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీరు ఒకవేళ లాకర్‌ వెసులుబాటు కావాలంటే లాకర్‌ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు ఉచితంగా డీడీ, మల్టీ సిటీ చెక్స్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్, నెఫ్ట్, ఆర్‌టీడీఎస్‌ సేవలు, దేశంలోని అన్ని ఏటీఎంలల్లో ఉచితంగా అన్ లిమిటెడ్‌ ట్రాన్సాక్షన్స్‌ లాంటి బెనిఫిట్స్‌ ఉంటాయి. మరెందుకు లేటు, మీరు కూడా శాలరీ అకౌంట్‌ను అప్‌డేట్‌ చేసుకోండి. ఈ బెనిఫిట్లను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news