దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదని ఎస్‌బీఐ తెలియజేసింది. ఈ మేరకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాలన్న నిబంధనను ఎత్తి వేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట లభించనుంది.
ఇక మినిమం బ్యాలెన్స్ నిబంధనను తొలగించడంతోపాటు పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. కాగా దేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్‌బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎస్ఎంఎస్ చార్జిలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.1వేయి కనీస నిల్వను ఉంచాల్సి ఉండగా, ఇప్పుడు ఆ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు.