కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని సినిమా, బీడీ కార్మికుల పిల్లలతోపాటు సున్నపు రాయి, మాంగనీసు, ఇనుప గనుల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ ప్రకటన విడుదల చేసింది..

ఎవరు అర్హులుః 1-10వ తరగతి చదివే విద్యార్థులు ప్రీ మెట్రిక్‌ కేటగిరీలో అర్హులు.  11వ తరగతి నుంచి వృత్తివిద్య కోర్సుల వరకు పోస్ట్‌ మెట్రిక్‌ విభాగం కింద అర్హులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు

దరఖాస్తు: ఆన్‌లైన్లో

చివరితేదీః అక్టోబర్‌ 31

వెబ్‌సైట్ః https://scholarships.gov.in

దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా 0120-6619540కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లోని కార్మిక సంక్షేమ సంస్థను 040-24658026 నంబరులో లేదా [email protected] లో సంప్రదించవచ్చు.

-శ్రీవిద్య