కరోనా కారణంగా సుమారు పది నెలలుగా స్కూల్స్ సహా కాలేజీలు అన్నీ మూత పడ్డాయి. ఎట్టకేలకు పిల్లలకు స్కూల్స్ ప్రారంభించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. తాజాగా నేడు తెలంగాణలో తొమ్మిది, పది తరగతులతో పాటు ఆపై తరగతులకు విద్యాబోధన ప్రారంభం కానుంది. మరో వైపు క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐతే..తల్లిదండ్రుల అనుమతి ఉన్న విద్యార్థులనే స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతిస్తారు.
మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి… ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రారంభిస్తోంది. ఇప్పటికే తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలానే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు క్లాసులు జరుగుతున్నాయ్. నేటి నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. తరగతికి 20 మంది ఉండేలాగా ఈ క్లాసులు నిర్వహించాలని చూస్తున్నారు. ఒకటి రెండు రోజులు క్లాసులు నిర్వహించాకనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.