కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసే ఉన్నాయి. దాదాపు ఈ సంవత్సరం వృధా అయిపోతుందే అన్న సమయంలో 9,10వ తరగతులతో పాటు కాలేజీ చదువులు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు విద్యాలయాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన తరగతులకు ఎప్పటి నుండి క్లాసెస్ మొదలవుతాయనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి పాఠశాలలు తెర్చుకోనున్నాయని తెలుస్తుంది. 6,7, 8 తరగతుల వారికి క్లాసెస్ మొదలు పెట్టుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఐతే కరోనా జాగ్రత్తలు అన్ని పాటించాల్సిందేనని, ఏమాత్రం నిర్లక్షం చేయకుండా అన్ని జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకోవాలని, పాఠశాలలకి పిల్లలని పంపడం తల్లి దండ్రుల బాధ్యత అని, వారికి ఇష్టం ఉంటే పంపించవచ్చని,క ఖచ్చితంగా పంపమని బలవంతం చేయకూడదని, పిల్లలు, తల్లిదండ్రుల ఇష్టంతోనే పాఠశాలకి రావాలని అన్నారు. ప్రాథమిక విద్య చదివే వారికి మాత్రం ఇప్పుడప్పుడే పాఠశాలలని ఓపెన్ చేయడం లేదని తెలిపారు.