చీర ధరించడంలో శాస్త్రీయ కోణం..!

-

భారతీయ సంప్రదాయంలో మహిళలకు, వారు ధరించే చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. నుదిటిన బొట్టు, పట్టు చీరలు ధరించి కనిపిస్తే దేవతలా కనిపిస్తారు. అందం, అభినయం, శక్తిలోనూ చీరకు సాటి లేదు. మోడ్రన్ కల్చర్ పేరుతో జీన్స్, ప్యాంట్లు వచ్చాయి. కానీ, చీరకు ప్రత్యేక చరిత్రే ఉంది. ఈ చీర కట్టుపై రామాయణం, మహాభారతం, వేదాల్లోనూ పండితులు, పరిశోధకులు అనేక రకాలుగా చెప్పుకొచ్చారు. చంద్రగుప్త రాజు కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు కూడా స్త్రీ వస్త్రాలంకరణ, చీరకట్టుపై పలు అంశాలను తెలిపారు. తన పుస్తకంలో ‘బంగారు జరీతో విలువైన రాళ్లు పొదగబడినవి’’ అని చీర విశిష్టతను మెగస్తనీసు చెప్పుకొచ్చాడు.

Types-of-Sarees
Types-of-Sarees

చీర కట్టు సంప్రదాయం ఎంతో విశిష్టతను సొంతం చేసుకుంది. భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో చీరకట్టు విధానం ఒక్కో రకంగా ఉంటుంది. అయితే సనాతన ధర్మంలో మహిళలు చీరను కట్టడంలో శాస్త్రీయ కోణం దాగి ఉందని పలువురు పరిశోధకులు తెలిపారు. ప్రతి మనిషి శరీరంలో శక్తి, చైతన్యం అనే రెండు ముఖ్యమైన కారకాలు ఉంటాయి. స్త్రీలలో శక్తిని ప్రేరేపిస్తే.. పురుషుల్లో చైతన్యం అనే ముఖ్యమైన అంశాలు పనిచేస్తాయి. మనిషి శరీరంలో సర్వేంద్రియాలకు మూలం శక్తి. భూమి, విశ్వం, శరీరంలో ఆరోగ్యకరమైన శక్తి కదలికలు ఓకే విధంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ శక్తి కేంద్రాలు వృత్తాల్లో కదులుతూ ప్రకాశవంతంగా మెరుస్తాయి.

స్త్రీ శరీర ఆకృతి కొంచెం వంకరగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సర్వేంద్రియాలు చురుగ్గా పని చేస్తే స్త్రీ అంత ఆరోగ్యంగా ఉన్నట్లు. అయితే భూమండలంపై కంటికి కనిపించని ఎన్నో శక్తులు ఉంటాయి. అవి మొదటగా మన వస్త్రాలను తాకి.. శరీరం నుంచి శక్తి మార్గంలో అంతర్గత అవయవాలకు చేరుతుంది. సాధారణంగా స్త్రీలు వృత్తాకారంలో చీరలను ధరిస్తారు. కాబట్టి ఏదైనా శక్తి చీరకు తాకినప్పుడు అతి వృత్తాకారంగా ప్రదిక్షిణలు చేస్తూ ప్రయాణించి శరీరానికి తాకుతాయి. అలా సరైన మార్గంలో శక్తిని తరలించడానికి చీరలు పనిచేస్తాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ధరించే సింథటిక్ ఫైబర్, లైకా, ఫిట్‌నెస్ దుస్తువుల వల్ల ఆరోగ్యానికి హానికారమని, నూలు, పత్తి, పట్టు వంటి సహజ పద్దతుల్లో తయారయ్యే చీరలనే ధరించాలని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news