సీఎం జగన్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యా యత్నం.. ఎందుకంటే..?

-

ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. ఓ మహిళా సీఎం ఇంటి ముందు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న సిబ్బంది ఆమె అడ్డుకొని అసలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నించడానికి కారణమేంటో తెలసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

suicide
suicide

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది. నెల్లూరు జిల్లా దత్తలూరు తహసీల్దార్ తమకు మోసం చేశాడని ఆరోపిస్తూ నాగార్జున, భవానీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు.

గురువారం నెల్లూరు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లి వచ్చిన నాగార్డున.. సర్వీసు రోడ్డు దగ్గరి నుంచి సీఎం ఇంటికి వెళ్లే చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలవాలని పోలీసులను కోరుతూనే భవానీ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. వెంటనే తేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం ఇది మొదటిసారి కాదు.

గతనెల 27వ తేదీన కూడా ఈ కుటుంబం వెలగపూడిలోని సచివాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. అఫ్పుడు పోలీసులు వారిని రక్షించి ఇంటికి పంపేశారు. తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి దత్తలూరు తహసీల్దార్ తమ వద్ద నుంచి రూ.కోటిన్నర తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని, ఆన్‌లైన్‌లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు. తమ భూమి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లుగా వారు తెలిపారు. గత ఏడాది ఇదే సమస్యపై నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా.. కలెక్టర్ స్వయంగా హామీ ఇవ్వడంతో విరమించామని.. కానీ అప్పటి నుంచి తమ సమస్యను పరిష్కరించలేదని నాగార్జున, భవానీ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news