శుక్రగ్రహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్ పరిశోధకుల!

-

శుక్రగ్రహంపై జీవం ఆనవాళ్లను ఖగోళ పరిశోధకులు గుర్తించారు. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాలు ఫాస్పెన్ అణువులు ఉన్నాయని బ్రిటన్లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పెన్ విడుదల చేస్తాయి. శుక్రుడు పై ఫాస్పెన్ అణువులు ఉన్నాయంటే, సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.

ఫాస్పెన్ అణువులు జీవుల్లో తప్ప సహజంగా లభించే కాదన్న అవగాహన. ఒక్కో ఫాస్పెన్ అణువులో ఒక పరమాణువు ఫాస్ఫర్ మూడు పరమాణువుల హైడ్రోజన్ ఉంటుంది. మైక్రోబ్స్ అనే సూక్ష్మజీవుల్లో ఫాస్పెన్ అణువులు భూమి మీద గుర్తించారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే పర్యావరణంలో మాత్రమే ఈ మైక్రోబ్స్ మనుగడ సాగిస్తాయి.

నిపుణుల బృందం చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్ లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితలం నుంచి 60 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న క్లౌడ్ డెక్ ను పరిశీలించారు. ఈ క్రమంలోనే వీరు ఫాస్పెన్ అణువులు గుర్తించారు. భూమి మీద ఈ అణువులు సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం నుండి లభిస్తుంది.

ఫాస్పెన్ కు మండే స్వభావం ఎక్కువ. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఫాస్పెన్ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలదని చెప్పలేమంటున్నారు. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికీ జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితి చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భూమి మీద కాకుండా వేరే రాతి మీద ఫాస్పెన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీద ఇంత ఆసక్తి ఎందుకంటే… ఇది మనకు సమీపంగా ఉండటమే కాక పరిమాణంలో భూమితో సమానమైనది. అంతేకాక ఇక్కడ చురుకైన అగ్నిపర్వతాల ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news