తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో భారీ విధ్వంసం జరిగింది.భారీగా వీచిన ఈదురు గాలులు, వర్ష బీభత్సానికి ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేల చేట్లు నెలకొరిగాయి. ఏకంగా 500 ఎకరాల్లోని అటవీ ప్రాంతం విస్తరించిన ప్రదేశంలోని చెట్లన్నీ నెలకొరగడంతో స్థానికులతో పాటు అధికారులు సైతం ఒకింత షాక్‌కు గురవుతున్నారు. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ స్పందించారు.
ములుగు అటవీ ప్రాంతంలో వేల చెట్లు నెలకొరగడానికి వాతావరణంలో మార్పులే కారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు.సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతం ధ్వంసమైందని చెప్పారు.దీనిపై లోతైన విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.దీనిపై కేంద్రానికి కూడా నివేదిక సమర్పిస్తామన్నారు. ఇదిలాఉండగా, మంత్రి సీతక్క సైతం ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు తిరిగి చెట్లు నాటే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.