నేడు ఎస్ఈసీ అఖిలపక్షం.. దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం

-

ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై పార్టీల అభిప్రాయం తీసుకోవడానికి ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రాజకీయ పార్టీల భేటీకి వైసిపి దూరంగానే ఉంది. చివరి నిమిషంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు.

ఈ సమావేశం నిర్వహించడానికి ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ చదువుకోవాలని ఆయన నిమ్మగడ్డకు సూచించారు. నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ తర్వాతే మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. కానీ హెల్త్ సెక్రటరీ లాంటి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవడంలో అర్థం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం దీనిమీద హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది సుప్రీమ్ ఉత్తర్వులకి విరుద్దంగా జరుగుతున్న ఈ సమావేశం జరగకుండా స్టే ఇవ్వాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news