స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ మధ్య రసవత్తర పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అండగా టీడీపీ నేతలు నిలబడటంతో.. వారి అనుకూల మీడియా కూడా నిమ్మగడ్డ వైపు నిలబడింది. అయితే బాబు ఏమి ఆలోచించారో ఏమో కానీ.. ప్రస్తుతం బాబు అనుకూల మీడియా నిమ్మగడ్డ ను జగన్ కలిపి ఒకే ఘాటికి కట్టేస్తుంది!
అవును.. నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా కారణాన్ని చూపిస్తూ (టీడీపీకి నచ్చిన) ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు నిమ్మగడ్డ మళ్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో జగన్ సర్కార్.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది! నాడు రాష్ట్రం మొత్తం పట్టుమని పదికేసులు లేనప్పుడు సమస్యగా ఉన్న కరోనా ఇప్పుడు రోజుకి మూడు నాలుగు వేలు నమోదవుతున్నప్పుడు సమస్య కాదా అని ప్రశ్నిస్తుంది! ఇదీ కరెక్టే…!
అయితే నాడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సమర్ధించిన టీడీపీ నేతలు.. నేడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అదే నిమ్మగడ్డ భావిస్తున్నా కూడా సమర్ధిస్తుంది. కానీ… “సామాన్యులకే రమేష్ కుమార్ లాజిక్ అర్ధం కావడం లేదు”! దీంతో.. ఇప్పుడు ఈ వార్ ద్వారా క్రెడిట్ పొందాలని తాపత్రయ పడుతుంది టీడీపీ.. అందులో భాగంగా వారి అనుకూల మీడియాలో అలాంటి కథనాలు రాయిస్తుంది!
“నాడు నిమ్మగడ్డ ఎన్నికలు వద్దాన్నా.. నేడు నిర్వహించాలని అంటున్నా.. తమకు అంగీకారమే! ఎందుకంటే.. తమకు రాజ్యాంగం మీద, రాజ్యాంగ పదవుల మీద అంత గౌరవం” అని కలరింగ్ ఇవ్వాలనేది టీడీపీ తాపత్రయం! ఫలితంగా… ఈ వార్ లో “ఫలితం” పొందడానికి అవసరమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా బలిపశువుని చేయడానికి.. నాడు జగన్ – నేడు నిమ్మగడ్డ అంటూ కథనాలు రాయించడానికి రెడీ అయ్యిందన్న మాట!! సో… చంద్రబాబు రాజకీయ క్రీడలో నిమ్మగడ్డ కూడా బలిపశువే(నా)!?
“నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారో.. నేడు ఎందుకు నిర్వహిస్తామని అంటున్నారో.. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి” అని కూడా ప్రచురిస్తూ… జగన్ ను నిమ్మగడ్డను కలిపి ఒకే ఘాటికి కట్టేలా కూడా కథనాలు రాయించగల సమర్ధులు బాబు బ్యాచ్ అనే కామెంట్లు కొసమెరుపు!