భార్యాభర్తల బంధాల్లో కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చెప్పకుండా ఎదుటివారు తెలుసుకోవాలని భావిస్తారు. అలా భావించే వారిలో ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక రహస్యాలని ఆడవాళ్ళు తెలుసుకోవాలని మగవాళ్ళు భావిస్తారు. అవేంటో చూద్దాం.
చర్యల ద్వారా ప్రేమ
మగవాళ్ళు తమ చర్యల ద్వారా ప్రేమ తెలియజేస్తారు. మీక్కావాల్సిన పనులు చేస్తూ, ఎప్పుడు మీకేది కావాలన్నా తీసుకురావాలన్న ఆలోచనతో ఉంటారు. ఆ విధంగా తమ ప్రేమని మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటారు.
వాళ్ళు శ్రద్ధగా వింటారు
ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు, అవును, కాదు వంటి సమాధానాలు ఇస్తుంటారు. కానీ కొంతమంది మగవాళ్ళు అలా కూడా చెప్పరు. అపుడు వాళ్ళు మీరు చెప్పేది వినలేదని అర్థం కాదు. మీరు చెప్పినది వింటూ దానికోసం ఏం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు.
యాక్టివిటీ
తమ ఆలోచనలు పంచుకోవడం కంటే మీతో పాటు రకరకాల యాక్టివిటీల్లో పాల్గొనడమే ప్రేమ అని అనుకుంటారు. అలా పాల్గొనడాన్ని చాలా ఇష్టపడతారు. చాలామంది మగవాళ్ళకి ఆటలు, శృంగారం.. రెండూ తమ భాగస్వామిని మరింత దగ్గర చేస్తాయి.
వ్యక్తిగత సమయం కావాలనుకుంటారు
మీతో ఎలాంటి యాక్టివిటీలో పాల్గొన్నప్పటికీ తమకోసం సమయం కేటాయించుకోవాలని చూస్తారు. తమ అభిరుచులని పెంచుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఈ విషయం మీరు తెలుసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుందని ఆశపడతారు.
చాలా తొందరగా విడిచిపెడతారు
ఏ విషయం గురించైనా ఎక్కువ బాధపడాలని అనుకోరు. చాలా విషయాలని చాలా తొందరగా వదిలిపెడతారు. నిన్న రాత్రి జరిగిన వాదన గురించి ఈ రోజు మాట్లాడాలని మీరు భావిస్తే ఆ పని చేయవద్దు. ఎందుకంటే ఎప్పుడో మర్చిపోయి ఉంటారు.