బ్రేకింగ్: కూకటపల్లి కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి

హైదరాబాద్ లో కాల్పులు సంచలనం రేపాయి. నేడు మధ్యాహ్నం అందరూ చూస్తున్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున హెచ్ డీ ఎఫ్ సి బాంక్ ఎటిఎంలో డబ్బులు నింపే సమయంలో జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయింది. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 25 ఏళ్ళ లోపు వారని పోలీసులు భావిస్తున్నారు. ఆల్వీన్ రోడ్ లో ఈ ఘటన జరిగింది.

ఈ దుండగుల కాల్పుల్లో గాయపడ్డ ఆలీ మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల్లో ఆలీ పొట్టలోకి బుల్లెట్స్ దూసుకువెళ్ళాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు ఆలి మృతి చెందారని పోలీసులు వివరించారు. దుండగుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు పోలీసులు ఏర్పాటు చేసారు. సిసి కెమెరాలు దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.