ఏపీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ను చాలా రాష్ట్రాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో తమిళనాడుకు చెందిన ఎన్ టీ కె పార్టీ అధినేత సీమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే తమిళనాడుకు ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెన్నై సహా కోయంబత్తూర్, కన్యాకుమారి, తిరుచ్చి, మధురై లను రాజధానిగా మారుస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇక తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ గా 234 స్దానాల్లో పోటీ చేస్తున్న నామ్ తమిళర్ కచ్చి పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికే ఎం ఎన్ ఎం అధికారంలోకి వస్తే కోయంబత్తూరు ను రెండో రాజధాని చేస్తామని కమల్ హాసన్ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడు రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు.. 6,357 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 5,398 మంది పురుష అభ్యర్థులు, 956 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.