పోరాటం అపొద్దు.. సోదరా : రేవంత్ కు సీతక్క రిక్వెస్ట్ !

నేడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పుట్టినరోజు. 1969 నవంబర్ 8వ తేదీన జన్మించిన రేవంత్ రెడ్డి.. నేటితో 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి సారిగా… తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో… ఆయన అభిమానులు మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. భారీ కటౌట్లు, కేకులతో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… రేవంత్ రెడ్డికి తనదైన స్టైల్ లో పుట్టినరోజు శుభా కాంక్షలు చెప్పింది. ” పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి సోదరుడా.. నేను మీ నుండి ఈ పుట్టినరోజు కానుక గా ఒక్కటే ఆగడదల్చుకున్నా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న ఈ పోరాటపటిమను ఎప్పటికీ ఇలాగె కొనసాగించాలి” అంటూ సీతక్క పేర్కొన్నారు. అలాగే రేవంత్ రెడ్డి తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు సీతక్క. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి తిరుమల లో ఉన్నారు.