Sudigali Sudheer: ఆంధ్ర‌ అమ్మాయితో సుడిగాలి సుధీర్ పెళ్లి ! మ‌రీ రష్మి పరిస్థితి ఏంటి ?

-

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ .. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య్యారు. మనోడికి హీరోల‌కు ఎలాంటి క్రేజీ సంపాదించుకున్నారు. ఆయ‌న జబర్దస్త్ కామెడీ షోతో పాటు యాంకర్ గా, హీరోగా రాణిస్తున్నారు.
ఇటీవలే అఖిల్ అక్కినేని న‌టించిన‌ “మోస్ట్ ఎలిజేబుల్ బ్యాచులర్” చిత్రంలో హీరో కి సుడిగాలి సుధీర్ స్నేహితుడిగా నటించి..తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై ఓ బ్రాండ్ గా మారిపోయాడు.

తాజాగా సుధీర్.. పెళ్లిపై ఆస‌క్తిక‌ర ఆంశం నెట్టింట్లో వైర‌లవుతుంది. త్వ‌ర‌లో సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తన కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదిరినట్లు సమాచారం. విజయవాడ కి చెందిన సుధీర్ కృష్ణ జిల్లాకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇక ఆన్ స్కీన్ పై యాంకర్ రష్మితో మ‌నోడు ఘాటు ప్రేమాయణం నడిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా గతంలో వార్తలొచ్చాయి.
అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అని .. తామిద్దరం స్నేహితులంమ మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. కానీ సుధీర్ పెళ్లి విషయం తెలిసిన తర్వాత చాలామంది నెటిజెన్స్ రష్మి పరిస్థితి ఏంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సుధీర్ కాబోయే అమ్మాయి ఎవ‌రంటే.. నెట్టింట్లో చ‌ర్చ‌నీయంగా మారింది. ఈ విష‌యంతో ఓ క్లార‌టీ రావాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news