కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గున్ని పార్టీ నుంచి తరిమేయండి – సీతక్క

-

బిగ్ బ్రేకింగ్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందే…కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ సిగ్గుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు సీతక్క. హై కమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనన్నారు.

బందాలకతీతమే రాజకీయం…నిబద్దత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు,సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి….తమ్ముడి గెలుపే వెంకట్ రెడ్డి కి ముఖ్యమైతే…కాంగ్రెస్ కండువా వదిలేయాలన్నారు.

 

మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,కాంగ్రెస్ శ్రేణులపై టీఆరెఎస్,బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు…ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియా కు పోవడం ఎంతవరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news