రైతు సాగు చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ తో పోరాటం చేస్తున్న రైతు ఉద్యమం సెగ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు తగలింది. అక్షయ్ కుమార్ హీరో గా చేసిన సూర్య వంశీ అనే సినిమా విడుదల ను పంజాబ్ లో రైతులు ఉద్యమకారులు అడ్డు కున్నారు. తమ రాష్ట్రంలో చేస్తున్న రైతు ఉద్యమానికి మద్ధత్తు ఇవ్వ కుండా తమ రాష్ట్రంలో ఏ సినిమాను విడుదల కానివ్వమని రైతులు చెబుతున్నారు. సాగు చట్టాల వల్ల రైతులు తీవ్ర నష్ట పోతుంటే తమ డబ్బులతో సినిమాలు ఎలా చూడమంటారు అని చిత్ర బృందాన్ని ప్రశ్నించారు.
తమ పోరాటానికి మద్దత్తు ఇస్తేనే సినిమా లు తమ రాష్ట్రంలో ఆడనిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్ లోని హోషీయార్ పూర్ లో ఉన్న సినిమా హాల్స్ వద్ద ఉన్న ఈ సినిమా కు సంబంధించిన బ్యానర్లు, ఫ్లేక్సీ లను రైతులు చించేసారు. అక్కడ సినిమాను నిలిపి వేశారు. కాగ కరోన కారణంగా బాలీవుడ్ సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేవు. అక్షయ్ సూర్య వంశీ కి ప్రేక్షకుల ఆధారణ రావడం తో తమ సినిమా లను కూడా విడుదల చేయాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితు లలో రైతులు సినిమా లను రద్దు చేయడం బాలీవుడ్ పై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.