ఇండియాను వరస భూకంపాలు భయపెడుతున్నాయి. వరసగా దేశంలో ఏదో ఓ చోటులో భూకంపాలు వస్తున్నాయి. వరసగా భూకంపాలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా సోమవారం ఉదయం అండమాన్ నికోబార్ దీవులను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంప వచ్చింది. రాజధాని పోర్ట్ బ్లేయర్ కు ఆగ్నేయంగా 218 కిలోమీటర్ల దూరంలో భూమికి 19కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇదేవిధంగా ఈ రోజు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూడా భూకంపం సంభవించింది. మణిపూర్ లోని ఉక్రుల్ లో 4.4 తీవ్రతతోని భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం భూమికి 70 కిలోమీటర్ లోతులో కేంద్రీక్రుతం అయింది.
అంతకు ముందు కూడా ఇండియాలో వరసగా భూకంపాలు సంభవించాయి. మూడు రోజుల క్రితం గురువారం గుజరాత్ లోని ద్వారకాలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే రోజు అస్సాంలో తేజ్పూర్ లో 3.7 తీవ్రతతో, నవంబర్ 4న మణిపూర్ లో భూకంపాలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లలో కూడా ఇటీవల భూకంపాలు వచ్చాయి.