సెల్ఫీ పిచ్చి.. మరొకరి ప్రాణం తీసుకుంది..!

ఈ మధ్యకాలంలో ఎవరిలో చూసిన సెల్ఫీ పిచ్చి రోజురోజుకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే. అయితే సెల్ఫీ పిచ్చి ఉండటం మామూలే కానీ సెల్ఫీ పిచ్చి ప్రమాదాలకు దారి తీసే వరకు ఉంటే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎంతోమంది సెల్ఫీ తీసుకోవాలనే ఆశతో ప్రమాదకర ప్రదేశాల వద్ద ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని లింగం పేట లో సరదాగా సెల్ఫీ తీసుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రవహిస్తున్న వాగు లో కొట్టుకుపోయాడు. అప్రోజ్ అనే 22 ఏళ్ల యువకుడు… స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయాడు. కళ్ళముందు స్నేహితుడు కొట్టుకుపోతున్న ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉండిపోయారు మిగితా స్నేహితులు. అయితే ప్రస్తుతం వాగు ప్రవహిస్తున్న ఉదృతి చూస్తుంటే సదరు యువకుడు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తూన్నారు.