తమిళ చిత్రాల షూటింగ్ పై షాకింగ్ కామెంట్లు చేసిన సెల్వమణి..!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈమె ప్రముఖ డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక ఇతడు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా చెన్నై లో జరిగిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, దక్షిణ సమ్మిట్ లో పలువురు సినీ , వ్యాపార , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశంలో వివిధ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిఐఐ దక్షిణ సమ్మిట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమం మొదటిరోజు సెల్వమణి, సుహాసిని, అల్లు అరవింద్, ఉదయనిది స్టాలిన్, స్వామినాథన్, కార్తీ , మంజు వారియర్, వెట్రిమోరన్, రిషబ్ శెట్టి ఇలా చాలామంది ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈవెంట్లో రోజా భర్త ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సౌత్ లో దాదాపు 50 వేలకు పైగా సినిమాలు తెరకెక్కాయి. మన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి కానీ తమిళ సినిమాలు తమిళనాడులో కాకుండా వేరే రాష్ట్రాల్లో.. వేరే ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్స్ చేస్తున్నారు.

కొన్ని సినిమాలు అయితే మొత్తం షూటింగ్ అంతా తమిళనాడు బయటే జరుగుతుంది. దీంతో ఇక్కడి కార్మికులు నష్టపోతున్నారు.తమిళ సినిమాలో షూటింగ్స్ తమిళనాడులోని ఎక్కువగా జరిగేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం కావాలి.. వారి అభివృద్ధి కోసం తమిళనాడు ప్రభుత్వం సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అంటూ ఆయన కోరారు.అనంతరం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు . సెల్వమణి అడిగిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాను అంటూ ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news