ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి సుధ..!

-

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క సినీ ప్రేక్షకులే కాదు.. సినీ సెలెబ్రిటీలు కూడా ఆయన గురించి పలు సందర్భాలలో గొప్పగా చెప్పుకున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి సుధా కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయనపై పలు ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడని ఆమె కామెంట్లు చేశారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ను వారు అని సంబోధించాలని కూడా సుధా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సెట్ కి వస్తే సెట్ మొత్తం గోలగోలగా ఉంటుందని కామెంట్లు చేసిన సుధా.. షూటింగ్లో తారక్ తెగ అల్లరి చేసే వారని.. అదే సమయంలో హుందాగా కూడా ఉంటారు అని సదా చెప్పుకొచ్చింది.

స్టార్ హీరో అయినా కూడా ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలివిడిగా ఉంటాడు అని తెలిపింది. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో బాద్ షా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నా కాలు బెణికింది. ఆ సమయంలో నా కాలు వాచిపోయింది. అయితే ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకొని స్ప్రే చేశాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి ఇదంతా ఆయనకు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ స్వయంగా ఇలా చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనిపించింది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగితే చాలామంది చూసి చూడనట్లు వ్యవహరిస్తారు.

ఎన్టీఆర్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు.. ఆయనను భగవంతుడు చల్లగా చూడాలి అంటూ సుధా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుధా ఎన్టీఆర్ గురించి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సుధా కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news