రీ రిలీజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున ఖుషీ..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితం అయింది. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో ఆల్ టైం హిట్ రికార్డు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన రీ రిలీజ్ సినిమాల ఫలితాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం డైరెక్ట్ సినిమాలతోనే కాదు రిలీజ్ సినిమాలకు కూడా సత్తా చాటుతున్నారు పవన్ కళ్యాణ్. కాలాన్ని తవ్వి ఎప్పుడు బయటకు తీసినా కళకళా మెరిసిపోతూనే ఉంటాయి ఆయన సినిమాలు. వాటిని చూసిన ప్రేక్షకుల మోములు మురిసిపోతాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండే టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఖుషి.

ఇగో అనే సింగిల్ లైన్ పాయింట్ మీద నడిచిన ఈ ప్రేమ కథ చిత్రం తెలుగు సినిమాలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. అప్పటికే వరుసగా 6 హిట్లతో దూకుడు మీదున్న పవర్ స్టార్ ఖుషితో ఏకంగా ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు. ఓ లవ్ స్టోరీ తో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పవన్ స్టామినాకు నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్, యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఇదొక ట్రెండ్ గా కూడా నడిచింది. నిజానికి అప్పుడే చాలామంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిపోయారు. ముఖ్యంగా మణిశర్మ అందించిన స్వరాలు బంపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఈ మ్యూజిక్ ఆల్బమ్ మంచి పాపులారిటీ అందుకుంది.

ఇకపోతే దాదాపు అంతటి గొప్ప మూవీ ని 22 సంవత్సరాలు తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 31న 4కే ప్రింట్ తో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో అడ్వాన్స్ బుకింగ్ చూస్తే తెలిసిపోతుంది. ప్రస్తుతం ముందుగా బుకింగ్స్ ద్వారానే 2కోట్ల 50 లక్షల రూపాయలు,అలాగే నిన్న కోటి 80 లక్షల రూపాయలకు పైగా వచ్చినట్లు సమాచారం. ఎస్ జె సూర్య దర్శకత్వంలో భూమిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. సంక్రాంతి సినిమాలు విడుదల అయ్యేవరకు థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఈ సినిమా మరొక రూ.4 కోట్లు సంపాదించే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news