విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న..నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) తెలుగు ప్రజల ఆరాధ్యుడు. కథా నాయకుడిగానే కాక ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజలకు సేవ చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన ఎన్టీఆర్..ఏదైనా పని అనుకుంటే చాలు..అది తప్పకుండా చేసేవారు. కాగా, ఆయన తన సొంత తనయుడు బాలకృష్ణ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అందుకు గల కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.
‘మనదేశం’ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ..‘తెలుగు దేశం పార్టీ’ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక తన తనయుడు బాలయ్య.. ప్రస్తుతం సినిమా, రాజకీయాలు రెండిటిలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తూనే మరో వైపున సినీ హీరోగా కొనసాగుతున్నారు.
ఇక బాలయ్య మ్యారేజ్ విషయానికొస్తే..వసుంధరను బాలయ్య పెళ్లి చేసుకున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు బంధువుల అమ్మాయి అయిన వసుంధరను బాలయ్య పెళ్లి చేసుకున్నాడు. కాగా, అప్పట్లో ఆయనకు రూ.10 లక్షల కట్నం ..వసుంధర తరఫున ఇచ్చారట. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రజా సేవలో ఉన్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెళ్లికి రాలేదట.
బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ కావాలనే రాలేదని తర్వాత నాదెండ్ల వ్యాఖ్యానించారట. మొత్తంగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లిన ఎన్టీఆర్ తన సొంత కుమారుడి పెళ్లికి కూడా హాజరు కాలేకపోవడం అప్పట్లో ప్రజల్లో చర్చనీయాంశమయిందట. ఇకపోతే నందమూరి బాలకృష్ణ కూడా తన తనయుడు మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు.