టీడీపీ అంటే ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఉన్న చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చంద్రబాబు హయాం నుంచి ఉన్న సీనియర్ నేతల పెత్తనమే ఇప్పటికీ పార్టీలో కొనసాగుతోంది. అయితే చంద్రబాబు రాబోయే కాలంలో లోకేష్ నాయకత్వంలోనే పార్టీని ఉంచాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు ఏసుకుంటున్నారు. అయితే పార్టీలో లోకేష్‌ను నాయక్తవాన్ని ఎంతమంది ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు రీసెంట్ గా అధిష్టానం అంతర్గత సర్వే నిర్వహించిందని తెలుస్తోంది.
కాగా ఇందులో రెండు అంశాలు ఉన్నాయంట. లోకేష్ నాయక్తవాన్ని ఒప్పుకోవడంతో పాటు చంద్రబాబు నాయకత్వమే కావాలనుకునే వారు కూడా అసలు పార్టీలో ఎంతమంది ఉన్నారనే దానిపై సీనియర్ నేతల నుంచి అలాగే యూత్ నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారంట. అయతే ఇందులో రెండు అంశాలు కీలకంతో పాటు ఎవరిని ఔనన్నా ఎవరిని కాదన్నా కూడా సమస్యలు వస్తాయని సీనియర్లు ఆచితూచి వ్యవహరించారంట.
అయితే ఈ సర్వేపై ముందుగానే చాలామందికి మ్యాటర్ లీక్ కావడంతో చాలా మంది ఈ అంశాలపై మౌనంగానే ఉన్నారంట. ఇక సీనియర్లు మాత్రం చంద్రబాబు నాయక్తవమే కావాలని చెప్పారంట. ఇక ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో కేవలం 8 నుంచి 9 మంది లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇక చాలామంది అయితే లోకేష్ నాయకత్వాన్ని అయిష్టంగానే స్వీకరిస్తున్నట్టు సమాచారం. కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు కూడా లోకేష్‌ను చంద్రబాబు రేంజ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారని అంటున్నారంట.