BREAKING : వాయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. కాసేపటి క్రితమే కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నట్లు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న పోలింగ్.. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లు ప్రకటించింది.
ఇవాళ్టి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిపింది కేంద్ర ఎన్నికల కమిషన్. అలాగే.. వాయనాడ్ ఉప ఎన్నికపై స్పందించిన సీఈసీ..కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చిందని తెలిపింది. ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.. కోర్టు తీర్పు తర్వాత ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది సీఈసీ.