నెల రోజుల క్రితం ఒక చిన్న సినిమాగా విడుదలైన సాధారణ సినిమా “బలగం”. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా కమెడియన్ వేణు డైరెక్షన్ బాధ్యతలను భుజాలపైన వేసుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి నేటి వరకు కలెక్షన్ లు ఏ మాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన జోరును చూపిస్తోంది. తెలంగాణ పల్లె జీవిత సత్యాలను కాళ్ళ ముందు మెదిలేలా చేసినా చిత్రంగా అందరి ప్రశంసలను అందుకుంది. వేణు లో ఇంతటి గొప్ప దర్శకుడు ఉన్నాడా అనిపించిన చిత్రం బలగం.
తాజా సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ. 24.74 కోట్లు గ్రాస్ కలెక్షన్ లను అందుకుంది. కాగా నెలరోజులు అవుతున్నా ఇప్పటికీ రోజుకు రూ. లక్షల వరకు కలెక్షన్ లను సాధిస్తోంది అంటే సినిమాను ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారు అన్నది తెలుసుకోవచ్చు.