తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం – డిజిపి మహేందర్ రెడ్డి

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు డీజీపీ మహేందర్ రెడ్డి. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు ఆపరేషన్స్ లో భాగంగా భద్రాధ్రి, ములుగు జిల్లాలలో పర్యటించానని తెలిపారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీసు శాఖ కృషిచేస్తోందన్నారు. భద్రాధ్రికొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల పనితీరుపై రివ్యూ నిర్వహించడం జరిగిందన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర నిఘా, ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాలో మావోయిస్టుల గేట్ వే కావడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసుల పనితీరుని కొనియాడారు డిజిపి మహేందర్ రెడ్డి. శాంతిభద్రతలపైనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు టాప్ ప్రియారిటీ ఇస్తోందన్నారు. మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్ లో మావోయిస్టులకు ప్రవేశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news