ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఓ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ఇకనుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ ల పై నిషేధం విధించారు. ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారు చేసినవే పెట్టాలని అన్నారు సీఎం జగన్. ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ఇక ఈరోజు ఉదయం ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు ప్లాస్టిక్ వ్యర్ధాలని సేకరించే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు ఆదిమూలకు సురేష్, గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం.. విశాఖ నగరాన్ని కాపాడుకుందాం అన్నారు. ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని.. అద్భుతమైన నగరంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.