ఎన్టీఆర్ మూవీ నుంచి సెన్సేషనల్ న్యూస్ లీక్..!

-

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ ను తీసుకొచ్చి అతడిని పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది ఈ చిత్రం. ఇకపోతే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న #NTR 30.. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ , యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతుండడం పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా..చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇలా ఎన్నో అనుమానాల మధ్య చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. అలాగే మ్యూజిక్ సిట్టింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ జనవరిలో మొదలవబోతోంది అని కూడా వెల్లడించారు. ఈ సినిమా నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ లీక్ అవడంతో అభిమానులలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Janhvi Kapoor to star opposite Jr NTR making her Tollywood debut? Details inside!

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోందని తెలిపి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల .. ఇప్పుడు ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను తీసుకున్నారని సమాచారం. ఇక విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news