రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక నిర్ణయం

-

రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్. ఆహార భద్రత కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 30నే ఈ గడువు ముగిసిన క్రమంలో మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 లోపు రేషన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. అంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఎవరైనా ఆధార్, రేషన్ కార్డు లింక్ చేసుకోని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత గృహ ప్రథకాల ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాల్సిందే. అందుకే ప్రభుత్వం పలు మార్లు ప్రజలను లింక్ చేయాలని కోరుతోంది.

ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యంతో పాటు వివిధ సరుకుల్ని అందిస్తున్నాయి. అయితే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను కలిగి ఉండి ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. దీంతో అనర్హులకు రేషన్ కార్డుల్ని తొలగించాలని నిర్ణయించిన ప్రభుత్వం రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలని ప్రతిపాదించింది.

కాబట్టి ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ లింక్ చేయకపోతే మాత్రం వారి పేర్లను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయాలనుకునే వారు సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news