వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని ముందు భావించిన సరే అనూహ్యంగా కిందిస్థాయి కోర్ట్ కి వెళ్ళాలి అంటూ హైకోర్టు పేర్కొంది. అయితే రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ను కొట్టేసిన వార్తలు వచ్చాయి. అది నిజం కాదని కేవలం కిందిస్థాయి కోర్టులో పిటిషన్ వేయాలని మాత్రమే హైకోర్టు చెప్పింది అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు.
కోర్టు ఈ విషయంలో ఫార్మాలిటీ ఫాలో అయిందని కిందిస్థాయి కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన వెంటనే హైకోర్టు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి పలు పార్టీలు కూడా న్యాయ సహాయం అందించడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి మరియు విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.