ఇకపై రీమేక్ సినిమాల‌ జోలికి వెళ్లనంటున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఎందుకంటే..?

మొదటి నుంచి కూడా నిఖిల్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. మిగతా యువ కథానాయకులతో కలిసి విజయాలను అందుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. అయితే క్రితం ఏడాది రీమేక్ మూవీ అయిన ‘కిరాక్ పార్టీ’లో నటించాడు. ఆ సినిమా ఆయనతో పాటు అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. ఇక నిఖిల్ కథానాయకుడిగా రూపొందిన ‘అర్జున్ సురవరం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో వచ్చిన ‘కనితన్’ సినిమాకి ఇది రీమేక్. అదే దర్శకుడు తెరకెక్కించిన ‘అర్జున్ సురవరం’ .. తమిళంలో కంటే తెలుగులో బాగా వచ్చిందనే టాక్ కూడా వినిపించింది.

కొన్ని కారణాల వలన విడుదల విషయంలో జాప్యం జరిగినప్పటికీ, తొలిఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇకపై నిఖిల్ రీమేక్ లకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ‘ఇకపై రీమేక్ సినిమాలు చేయను’ అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం ఆశ్చర్యకరం. పాపం రీమేక్ సినిమాల వలన ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయోగానీ, కుర్రాడు గట్టి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.