Shahid kapoor : అది.. ముంబై లోని వాసాయ్.. చాలా రద్దీ ప్రాంతం. ఎవరూ ఊహించని విధంగా ఓ రోడ్డుపై కుప్పలుకుప్పలుగా 2 వేల రూపాయల నోట్లు పడి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఒక్కరిని ఒకరూ తొసుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రికత . కానీ, వాటిని సరిగా చూసే సరికి.. అవన్ని నకిలీ నోట్లు. దీంతో వాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు.
కొందరేమో ఇలా గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేయడం నేరం అంటూ ..
ఇలా చేసినవారిపై కేసు పెట్టారు. దీనికి ప్రధాన కారణమైనా హీరో షాహిద్ కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై నోట్లు ఉండటమేంటీ? అసలు షాహిద్ కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమేంటి అనుకుంటున్నారా..?
వివరాల్లోకెళ్తే.. షాహిద్ కపూర్ [shahid kapoor] నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సన్నీ’. ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ లో భాగంగా ఓ యాక్సిడెంట్ సన్నివేశాన్ని ముంబైలోని వాసాయ్ లో చిత్రీకరించారు. ఆ సీన్ లో యాక్సిడెంట్ జరిగి.. రోడ్డుపై కరెన్సీ నోట్టు కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. అయితే. ఈ సీన్ షూట్ చేయడం కోసం.. నకిలీ నోట్లను ఉపయోగించారు. కానీ షూటింగ్ అయిపోయాక.. ఆ నోట్లను తీయడం మర్చిపోయారు యూనిట్ సభ్యులు.
దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. స్వల్ప ఉద్రికత కూడా ఏర్పడింది. కానీ, అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారిస్తున్నారు.
దీని మీద చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. షూటింగ్ అయిపోయకా.. ఆ నకిలీ నోట్లను తీసివేశాం.. కానీ ఆ నకిలీ నోట్లు మళ్లీ అక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. మహ్మాడిని అవమానించాలనే ఆలోచన ఏ మాత్రం లేదని తెలిపారు. ఇదేమైనా.. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం .. పెద్ద సమస్యలను తెచ్చిపెట్టింది.