కేంద్రం షాకింగ్ నిర్ణ‌యం..ఐస్ క్రీం పై 18శాతం జీఎస్టీ..!

-

సామాన్య ప్రజల పై మోడీ సర్కార్ అధిక ధరలతో భారం మోపుతున్న‌ సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ ఇలాంటి నిత్యావసరాల ధర‌ల‌న్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు తినే ఐస్క్రీం పై కూడా జిఎస్టి విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లర్లలో 18% జిఎస్టి విధించాలని పరోక్ష పన్నుల కేంద్ర మండలి సీబీఐసీ స్పష్టం చేసింది. గత నెల 17వ తేదీన జిఎస్టి కౌన్సిల్ సమావేశం జ‌ర‌గ్గా 21 వస్తుసేవల జిఎస్టి రేట్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సిబిఐసీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

దాంట్లో తయారైన ఐస్క్రీం ల‌ను విక్ర‌యించే కేంద్రాలే పార్లర్ల కింద‌కు వస్తాయని రెస్టారెంట్ త‌ర‌హావి కాద‌ని స్పష్టంచేసింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఐస్ క్రీమ్ పార్లర్ లు స్టోర్ ల‌ నిర్వాహకులతో పాటుగా ఐస్క్రీం ప్రియుల‌పై భారం పడనుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఐస్క్రీమ్ ల‌ను ఇష్టపడుతుంటారు. ఐస్ క్రీమ్ ఎక్కడ కనిపించినా కావాలని కోర‌తారు ఇక కొనివ్వ‌క తప్పదు కాబట్టి 18 శాతం జీఎస్టీ భరిస్తూ ఐస్ క్రీమ్ తినాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news