ఆస్కార్ విషయంలో రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్..!

-

షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన పఠాన్ ట్రైలర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ , విజువల్స్ అన్ని అదిరిపోయాయని చూసినవారు కామెంట్లు చేస్తున్నారు. షారుఖ్ పఠాన్ సినిమాతో కం బ్యాక్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈయన నటించిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రమంలోనే పఠాన్ ట్రైలర్ మీద రామ్ చరణ్ స్పందించాడు. ట్రైలర్ ను షేర్ చేసిన రామ్ చరణ్ కు షారుఖ్ రిప్లై ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా షారుఖ్ వేసిన ట్వీట్.. రామ్ చరణ్ గురించి చెప్పిన తీరు.. అందరిని ఆకట్టుకుంటుంది… ఈ ట్రైలర్ ను తెలుగులో రామ్ చరణ్.. తమిళంలో విజయ్ షేర్ చేశారు. దీంతో ఈ ఇద్దరికీ షారుఖ్ రిప్లై ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి చెబుతూనే.. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గురించి మాట్లాడేశాడు. “థాంక్యూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడైతే మీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇంటికి ఆస్కార్ అవార్డును తీసుకొస్తుందో.. అప్పుడు ఒకసారి దాన్ని టచ్ చేసి అవకాశాన్ని నాకు ఇవ్వు” అంటూ ట్విట్ చేశాడు.

మరొకవైపు విజయ్ ని కూడా ఆకాశానికి ఎత్తేసాడు. “థాంక్యూ మై ఫ్రెండ్ విజయ్. నువ్వు ఇలా నిజాయితీ గా ఉంటావు కాబట్టి దళపతి అయ్యావు.. మరోసారి మీ ఇంటి వంటలను రుచి చూడాలని ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికైతే షారుఖ్ ఖాన్ చేసిన ఈ రిప్లై ట్రీట్ వైరల్ గా మారుతుంది. అలాగే రామ్ చరణ్, విజయ దళపతి అభిమానులు షారుఖ్ ఖాన్ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news