శకుంతల విడుదల డేట్ ఫిక్స్.. !

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతల గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారా అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్న విషయాన్ని చిత్ర బృందం తాజాగా ట్విట్టర్ లో తెలిపింది..

మైథలాజికల్ డ్రామా గా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను అద్భుతంగా తర్కెక్కించినట్టు తెలుస్తోంది అలాగే సమంత కూడా తాజాగా యశోద చిత్రంతో మంచి సక్సెస్ను అందుకుంది అయితే సమంత నుంచి రాబోతున్న మరొక చిత్రం శకుంతల ఎప్పుడు విడుదలవుతుందా అంటే ఇప్పటివరకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తాజా చిత్ర బృందం ట్వీట్ చేసింది..

సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతుంది ప్రారంభంలో మాత్రం రొమాంటిక్ మూవీస్ లో నటించిన ఈమె తర్వాత మాత్రం కథకే ఓటేస్తూ ముందుకు వెళుతుంది ఓ బేబీ యశోద శకుంతల వంటి సినిమాలే అందుకు నిదర్శనం అయితే ఇప్పటికే సమంత ప్రధానోపాత్రలో నటించిన ఓ బేబీ యశోద చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మరొకసారి గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ శకుంతల చిత్రం పైన ఇప్పటికే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆమె అభిమానులంతా.

ఈ సినిమాను 2021 అక్టోబర్ లోనే ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది అలాగే కొన్నాళ్ల క్రితం షూటింగ్ను పూర్తి చేసినప్పటికీ వర్షం కోసం ఇప్పటివరకు ఆగినట్టు కూడా సమాచారం ఈ క్రమంలో కొత్త సంవత్సరం ప్రారంభం లో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని తెలుపుకొచ్చింది చిత్ర బృందం.. అలాగే “2023 ఫిబ్రవరి 17 నుంచి మీ సమీప థియేటర్లలో ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ వీక్షించండి. 3D వెర్షన్‌లో సైతం!!” అంటూ సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో కూడిన రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. అలాగే ఈ సినిమాలతో అల్లు అర్హ సినీ అరంగేట్రం చేయబోతుంది అల్లు వారి కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి అడుగుపెట్టబోతుంది..

Read more RELATED
Recommended to you

Latest news