కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘శాకుంతలం’కు అవార్డులు

-

సమంత ప్రధాన పాత్రలో ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖ‌ర్ రూపొందించిన ‘శాకుంతలం’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం అవార్డుల పంట పండుతోంది. తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ‘శాకుంతలం’ చిత్రానికి నాలుగు కేటగిరీలలో అవార్డ్స్ దక్కాయి.

Shakuntalam movie review : Boring Epic tale - Allu Arha, Gunasekhar, Mohan  Babu, Mythology, Samantha, Shakuntala, Shakuntalam |

శాకుంతలం సినిమాకు గతంలో న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌గా, బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా అవార్డులు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో శాకుంతలం సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ తమ ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేసింది. ఈ విషయం తెలిసి సమంత కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news