రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాల పల్లి జిల్లా , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిందని చెప్పింది. దీంతో గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగందో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో వర్షం పడింది.