శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత..పేస్టుగా మార్చి మరీ !

శంషాబాద్ లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. ఏకంగా కేజీ నర బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒక కేటుగాడు పట్టుబడ్డాడు. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడి దగ్గర కేజీన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాడు బంగారాన్ని పేస్టులాగా మార్చి నడుము భాగంలో దాచినట్లుగా గుర్తించారు. నిందితుడు మహ్మద్ ను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు అతని మీద పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులతో కలిసి సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేపట్టారు, ఆ తనిఖీలలో ఈ బంగారం దొరికింది. అలాగే అబుదాబి నుంచి వచ్చిన హమీద్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన విదేశీ సిగరెట్లు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. లగేజ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో ఒక బ్యాగ్ లో బుల్లెట్ కనిపించింది దీంతో బుల్లెట్  స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ బుల్లెట్టు ఎవరికి సంబంధించినది అని ఆరా తీసే పనిలో పడ్డారు.