హార్ట్ ఎటాక్ తో షేన్ వార్న్ మృతి.. ఎందుకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయంటే..?

-

ప్రముఖ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ శుక్రవారం నాడు గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారు. ఈయనకి 52 సంవత్సరాలు. ఈ వార్తను షేన్ వార్న్ కు సంబంధించిన మేనేజ్మెంట్ మీడియాకు తెలియజేశారు.

 

షేన్ వార్న్ తమ విల్లాలో కదలకుండా ఉండడంతో మెడికల్ స్టాఫ్ కు అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయారు, ఈ సంఘటన కో సమూయ్ థాయిలాండ్ లో జరిగింది. ఈ సమయంలో వారి కుటుంబం ప్రైవసీ కోరుకుంటోంది మరియు మరింత సమాచారాన్ని కొన్ని రోజుల తర్వాత చెబుతామని అంటున్నారు. షేన్ వార్న్ 2021 సెప్టెంబర్ లో కరోనాతో బాధపడి హాస్పిటల్ లో చికిత్స పొందారు. షేన్ వార్న్ 15 కేజీలు బరువు తగ్గడం జరగడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద వార్తగా మారింది.

ఈ మధ్యకాలంలో 40 నుండి 50 సంవత్సరాలు మరియు అంత కంటే తక్కువ వయసు వారు హఠాత్తుగా గుండె పోటుతో చనిపోతున్నారు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. పొగ తాగడం, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వంటి మొదలైన కారణాలు అని డబ్ల్యూహెచ్వో సంస్థ చెబుతోంది.

హార్ట్ ఎటాక్ లేదా రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, వాంతులు, వికారం, చెమటలు పట్టడం, చెస్ట్ పెయిన్ మొదలైనవి కనబడతాయి. అయితే మంచి జీవన విధానాన్ని పాటించి నిపుణుల సహకారంతో వ్యాయామాలు చేసుకోవాలి. అయితే ప్రస్తుతం కరోనా సమయంలో క్లాట్ ఫార్మేషన్ జరిగిన కొంత మందిలో గుండెపోట్లు వచ్చాయి.

కాబట్టి అది కూడా ఒక కారణం అవ్వచ్చు లేక జెనిటిక్స్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఉండడం వల్ల హార్ట్ ఎటాక్ రావడానికి మరిన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version