ఏడువేల అడుగులో ఉన్న దేవాలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

-

మన భారతీయులకు దేవుడి పై అపారమైన భక్తి ఉంటుంది.దేశం మొత్తంమీద ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఆవిర్భవించాయి.అయితే కొన్ని దేవాలయాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఆ ప్రత్యేకతలు చూడటానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి మహిమలు ఉన్న దేవాలయం ఉత్తరాఖండ్‌లో ఒకటి ఉంది. ఆ దేవాలయం చూసినంత ఉంటుంది. దాదాపు ఏడువేల అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది.వామ్మో అంత ఎత్తులో ఉందా.. భక్తులు ఎలా వెళతారు..అక్కడ ఏ దేవుడు కొలువై ఉన్నాడు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్‌లోని ఖర్సాలీ గ్రామంలోని చార్‌ధామ్‌లలో ఒకటైన యమునోత్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శని దేవుడు,అతని సోదరి యమునల ఆలయం కొలువై ఉంది.ఈ దేవాలయం వేసవిలోని వైశాఖి సందర్భంగా భక్తుల కోసం తెరుస్తారు.వేసవిలో ఇక్కడ సందర్సకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. ఖర్సాలీలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఈ కారణంగా ఈ శని దేవాలయం తలుపులు మూసి వేసవిలో మార్చి, ఏప్రిల్ మాసాలలో గుడి తలుపులు తెరుస్తారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ఖర్సాలీ గ్రామంలో సముద్ర మట్టానికి సుమారు 7 వేల అడుగుల ఎత్తులో ఉంది.ఈ ఆలయం చాలా చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయం కావడం విశేషం.శని దేవుడు తన సోదరి యమునను కలవడానికి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు యమునోత్రిని సందర్శిస్తాడు. యమునోత్రి నుంచి శని దేవాలయం 5 కిలో మీటర్లు ఉంటుంది.యమునోత్రికి వచ్చే చాలా మంది భక్తులు శనిదేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి చరిత్ర మహాభారత కాలం నాటిదని నమ్ముతారు.పాండవులు తమ ప్రయాణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.రాతి, చెక్కతో ఆలయాన్ని నిర్మించారు.శని దేవుడి విగ్రహం కాంస్య తో తయారు చేయబడి ఉంటుంది.ఆలయంలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది.ఆ దీపం కాంతి వల్లే విగ్రహం కనిపిస్తుంది.కోరిన కోరికలు తీరతాయని అక్కడి ప్రజల నమ్మకం.

 

Read more RELATED
Recommended to you

Latest news