దీప్తి సునయన బ్రేకప్ ప్రకటనపై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్ !

-

బిగ్ బాస్ ఫ్రేమ్ షణ్ముక్ కు సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన ఇవాళ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేళ అభిమానులకు షాక్ ఇస్తూ.. షణ్ముక్ బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. ఐదు సంవత్సరాల అనుబంధానికి ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టింది ఈ భామ. అయితే దీప్తి ప్రకటనపై తాజాగా షణ్ముక్ స్పందించాడు.

“ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. తను ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసి ఉంటాం. నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్ ద బెస్ట్ దీపు ” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు షణ్ముఖ్. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news