ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మళ్ళీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు మరియు తూర్పు గాలులు ఆంధ్రప్రదేశ్ లో వీస్తున్నాయని… వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడిగా వుండి.. రాత్రి సమయాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర లో ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా వుండే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశ ముంది. రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా వుండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము స్పష్టం చేసింది.