ఇరగదీశాడుగా: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ తో విద్వంసం సృష్టించిన శార్దూల్ ఠాకూర్ !

-

ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ మరియు ఆర్సీబీ లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ చేస్తున్న కోల్కతాకు ఆరంభంలోనే రెండు వికెట్ల రూపంలో భారీ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ (3) మరోసారి నిరాశపర్చగా… మన్దీప్ సింగ్ క్రికెట్ నే మరిచిపోయాడా అనేంతలా మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. కానీ గుర్బాజ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ వచ్చాడు.. ఈ దశలో ఐపీఎల్ లో మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. కాగా ఆ తర్వాత వరుసగా మరో వికెట్లు పడడంతో కోల్కతా ఇన్నింగ్స్ ఆత్మరక్షణలో పడింది.

కానీ రింకు సింగ్ మరియు శార్దూల్ ఠాకూర్ లు అద్భుతంగా ఆది జట్టును సేఫ్ లో పెట్టారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గ్రౌండ్ కు నాలుగు వైపులా భారీ షాట్ లు ఆడుతూ ఐపీఎల్ కెరీర్ లోనే ఫస్ట్ ఫిఫ్టీ ని సాధించి కోల్కతాను ఆదుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో కేవలం 21 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు మరియు 3 సిక్సులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news