30దాటిన మహిళలు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన సప్లిమెంట్స్

-

వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార అలవాట్లు మార్చుకోవాలి. వయసు పెరుగుతున్నప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పదార్థాలు రోజువారి ఆహారంలో దొరక్కపోవచ్చు. అందుకే వాటిని సప్లిమెంట్ల రూపంలో అందించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మహిళలు ఇంకా శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. వయసు 30దాటిన మహిళలు తమ ఆరోగ్యానికై ఆహారంలో చేర్చుకోవాల్సిన డైట్ సప్లిమెంట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 

ఫోలిక్ ఆమ్లం

కణాల పెరుగుదలకు, వాటి ఉత్పత్తికి ఫోలిక్ ఆమ్లం ఎంతో అవసరం. మహిళలు ముఖ్యంగా గర్భం కోసం ప్రయత్నించేవాళ్ళు లేదా గర్భంతో ఉన్నవారు విటమిన్ బి సప్లిమెంటుని తమ డైట్ లో చేర్కుకోవాలి.

ఐరన్

30ఏళ్ళు దాటిన మహిళలకు కావాల్సిన ఖనిజం ఐరన్. దీని లోపం చాలా మంది మహిళల్లో ఏర్పడుతుంది. దానివల్ల తీవ్రమైన అలసట కలుగుతుంది. అందుకే ఐరన్ సప్లిమెంట్ తప్పనిసరి.

డి విటమిన్

విటమిన్ డి కారణంగా ఎక్కువైన కాల్షియం శోషణ అవుతుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవారు తప్పనిసరిగా తమ డైట్ లో విటమిన్ డి సప్లిమెంటును చేర్చుకోవాలి.

మెగ్నీషియం

మెగ్నీషియం కారణంగా ఎముకలకు ఆరోగ్యం చేకూరుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరంగా ఉంచుతుంది. మెగ్నిషియం లోపం కారణంగా కండరాలు పట్టేయడం అనే సమస్య కలుగుతుంది. తీవ్రమైన అలసట, అధిక బీపీ, మూడ్ మారిపోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడడం, కండరాలు బలహీనం కావడం లక్షణాలుగా ఉంటాయి.

ప్రోబయోటిక్స్

ఈ బాక్టీరియాలు మీ శరీర జీవక్రియకు చాలా మంచివి. ఈ సప్లిమెంట్లు వల్ల డయేరియా, జీర్ణాశయ వ్యాధులు, ఐబీఎస్ మొదలగు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news