హుజురాబాద్ ఎన్నిక నోటిఫికేషన్ ఈటల సంచలన వ్యాఖ్యలు !

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు కావడంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ రావడంతో సుదీర్ఘ నిరీక్షణ కు తెరపడిందని… తన రాజీనామా చేసి ఐదు నెలలు అయిందన్నారు. ఐదు నెలల నుండి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుండి మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుండి అరడజను మంది మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని ఫైర్‌ అయ్యారు.

etala
etala

ప్రజా స్వామ్యం ను ఆపహస్యం చేసేలా వ్యవహరించారని… తన అనుబంధాన్ని తొలిగించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ పొలిటికల్ వ్యవస్థ పచ్చని సంసారంలా ఉండేదని… హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నార్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొనకకుండా జంక కుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచింది వారికి శిరస్సు వంచి మెక్కుతున్నానని వెల్లడించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యచరణ మీద చెప్పాలి గాని… స్వయంగా హరీష్ రావు…. సర్పంచ్ లు, ఎంపిటిసిలు,నాయకుల మీద చిందులేసాడని మండిపడ్డారు. గుండెలు బరువెక్కినా తొలగకుండా నిలిచారని…అని తెలిపారు. ధైర్యం, దమ్ము ఉంటే ప్రజా స్వామ్య బద్దంగా పోరాడాలని.. నా హుజురాబాద్ అడబిడ్డలు దళిత జాతి, యువకులు జై ఈటెల అంటున్నారన్నారు.  మొక్కవోని ధైర్యం తో అండగా నిలిచిన వారికి రుణం తీర్చుకోలేనని… 18 సంవత్సరాలు చేసిన సేవ ఇప్పుడు కనబడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news